Covid19 Updates : దేశంలో 3,720 కేసులు 20 మరణాలు
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
Covid19 Updates : కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రం అవుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఉన్నట్టుండి పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. మౌలిక వసతులు కల్పించాలని, బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
ఇక తాజాగా 24 గంటంలో దేశంలో 3,720 కోవిడ్ కేసులు(Covid19 Updates) నమోదయ్యాయి. సానుకూలత రేటు 2.47గా ఉంది. ఇక కరోనా కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,31,584కి చేరింది. యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.09 శాతంగా ఉన్నాయి.
ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 40,177కి చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి దాకా కోవిడ్ కేసుల సంఖ్య 4,49,56,716కు చేరుకుంది. జాతీయ కోవిడ్ 19 రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి దాకా 220.66 కోట్ల డోస్ ల వ్యాక్సిన్లు అందజేశారు. కరోనా కేసుల కారణంగా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరింది.
Also Read : మోదీ ముచ్చట చిన్నారులు ఫిదా