Brij Bhushan Sharan Singh : మోదీ కోరితే రాజీనామా చేస్తా
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
Brij Bhushan Sharan Singh : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) సంచలన కామెంట్స్ చేశారు. మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రాజీనామా చేయాలని కోరితే చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.
విచిత్రం ఏమిటంటే 1,000 మందిపై తాను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు . తాను ఒక్కడిని ఎలా వేధిస్తానని ప్రశ్నించాడు. నాలో అంత లైంగిక పటుత్వం, సామర్థ్యం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఒక రకంగా మహిళా రెజ్లర్లను ఎద్దేవా చేశారు. వారిపై సెటైర్లు విసిరారు. వాళ్ల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. తాను ఆరుసార్లు ఎంపీగా గెలుపొందానని, కేవలం తనను ఇబ్బంది పెట్టడం, తన ఇమేజ్ ను దెబ్బ తీసేందుకే ఇలా చేశారంటూ మండిపడ్డారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh).
ఇదిలా ఉండగా మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ నిప్పులు చెరిగారు. కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మద్దతు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి ప్రతీక