Same Sex Marriage : గే కమ్యూనిటీ సమస్యలకు కేంద్రం భరోసా
ప్యానెల్ ఏర్పాటు చేస్తామని కోర్టుకు వెల్లడి
Same Sex Marriage : కేంద్రం కీలక ప్రకటన చేసింది. గే కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి ప్యానెల్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హామీ ఇచ్చింది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. ఈ కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా స్వలింగ సంపర్క వివాహాలకు(Same Sex Marriage) సంబంధించిన కేసు బుధవారం నాటితో విచారణ ఏడవ రోజుకు చేరుకుంది.
నిజమైన మానవ ఆందోళనలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. స్వలింగ వివాహాలను చట్ట బద్దం చేసే ప్రశ్నకు వెళ్లకుండా స్వలింగ జంటలకు సామాజిక ప్రయోజనాలను విస్తరించ వచ్చా అని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత నెల ఏప్రిల్ 27న కేంద్రాన్ని ప్రశ్నించింది. వివరణ కోరింది.
ఇందుకు సంబంధించి ఇవాళ కేంద్రం తరపున ఎస్జీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా స్వలింగ వివాహాలను చట్టబద్దం చేసే అంశం శాసనసభ పరిధిలోకి వస్తుందని , ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదని కేంద్రం వాదిస్తోంది.
ప్రేమించే హక్కు,సహ జీవనం చేసే హక్కు, భాగస్వామిని ఎంచుకునే హక్కు, లైంగిక ధోరణిని ఎంచుకునే హక్కు అనేది ప్రాథమిక హక్కు అని కేంద్రం వాదించింది. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్(DY Chandra Chud) ప్రధానంగా ప్రస్తావించారు.
Also Read : నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి ప్రతీక