Mallikarjun Kharge : బొమ్మై సర్కార్ పై భగ్గుమన్న ఖర్గే
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్
Mallikarjun Kharge : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటలు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.
మే 10న కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక లోని గుర్మిట్కల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా బొమ్మై ప్రభుత్వంపై భగ్గుమన్నారు ఖర్గే. 40 శాతం కమీషన్ ప్రతి పనికి రేటు నిర్ణయించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బ్రాండ్ కర్ణాటక పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్. 6.50 కోట్ల మంది కన్నడిగుల సామూహిక ఆకాంక్షలను నెరవ్చేరడం తమ ఉద్దేశమని పేర్కొన్నారు. తాము విడుదల చేసిన మేనిఫెస్టో ప్రగతికి , సామాజిక న్యాయం, సంక్షేమానికి మార్గమని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
దేశంలో, రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బొమ్మైని భరించే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తాము అధికారంలోకి రావడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు.
Also Read : కేంద్ర సర్కార్ పై టికాయత్ కన్నెర్ర