KTR : కంపెనీలు వస్తేనే కొలువులు – కేటీఆర్
అమర్ రాజా లిథియం బ్యాటరీ కంపెనీ
KTR : పరిశ్రమలు ఏర్పాటు అవుతేనే కొలువులు వస్తాయని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కంపెనీల ఏర్పాటు వల్ల సంపద మరింత పెరుగుతుందని దీని వల్ల వివిధ విభాగాలలో జాబ్స్ వస్తాయన్నారు.
లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారని స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణలో ఏకంగా రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అభినందించారు. ఇలాంటి పరిశ్రమలు మరిన్ని రావాలని కోరారు.
ఒక పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా లేదా రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు కేటీఆర్(KTR). పెట్టుబడిదారులకు, కంపెనీల యజమానులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రభుత్వ పరంగా ఇస్తున్నామని చెప్పారు మంత్రి.
ఇదిలా ఉండగా దేశంలోని దాదాపు ఎనిమిదికి పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతాల్లో అమర్ రాజా లిథియమ్ బ్యాటరీ కంపెనీని ఏర్పాటు చేయాలని కోరారని కానీ కంపెనీ ఒప్పుకోలేదన్నారు. వాళ్ల ప్రయారిటీ పూర్తిగా తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చారని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : ది కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు