Priyanka Gandhi : మోదీని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు న‌మ్మరు

ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. మే 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 13న ఫ‌లితాలు రానున్నాయి. ఇక రాష్ట్రంలో ప్ర‌చారం తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ త‌రుణంలో అటు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇటు కాంగ్రెస్ హోరా హోరీగా ప్రచారం చేప‌ట్టాయి.

శ‌నివారం ఒక్క రోజు పీఎం నరేంద్ర మోదీ బెంగ‌ళూరులో రోడ్ షో చేప‌డితే రాహుల్ గాంధీ బెల‌గావిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఆయ‌న కూడా ప్ర‌త్యేకంగా ఉగ్ర‌వాదం గురించి ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి అబ‌ద్దాలు చెప్ప‌డంలో ఆరి తేరాడ‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న చెప్పే వాటిని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఇది త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ అవినీతికి కేరాఫ్ గా మారాయాని ప్రియాంక గాంధీ ఆరోపించారు. 40 శాతం క‌మీష‌న్ ప్ర‌తి ప‌నికి ఇవ్వాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేపై హ‌త్య చేసేందుకు బీజేపీ కుట్ర ప‌న్నిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , క‌ర్ణాట‌క రాష్ట్ర ఇంఛార్జ్ ర‌ణ‌దీప్ సూర్జేవాలా. దీనిపై సీఎం స్పందించారు. విచార‌ణ చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఉగ్ర‌వాదం గురించి మోదీకి ఏం తెలుసు

Leave A Reply

Your Email Id will not be published!