TS SSC Results 2023 : 10న పదవ తరగతి ఫలితాలు
వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
TS SSC Results 2023 : ఇప్పటికే ఏపీలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసింది అక్కడి సర్కార్. ఈసారి తెలంగాణలో ఇంకా రిజల్ట్స్ వెల్లడిలో కొంత ఆలస్యం జరిగింది. తాజాగా విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మే9న మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
కాగా పదవ తరగతి ఫలితాలను మే 10న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్ లో 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ పరీక్షలకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 10వ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో 4,85,384 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1809 మంది ఎగ్జామ్స్ కు హాజరు కాలేదు. ఇక ప్రైవేట్ పరంగా 443 మంది పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 191 మంది మాత్రమే హాజరు కావడం విశేషం. వేలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రంగంలోకి దిగింది ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం ముహూర్తం ఖరారు చేసింది. 10వ తరగతి ఫలితాలు వెల్లడించేందుకు.
Also Read : శాంసన్ పై కక్ష బీసీసీఐ వివక్ష