Sachin Pilot : అశోక్ గెహ్లాట్ పై స‌చిన్ పైల‌ట్ ఫైర్

అజ్మీర్ నుంచి జైపూర్ దాకా జ‌న్ సంఘ‌ర్ష్ యాత్ర

Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త పోరు తారా స్థాయికి చేరింది. సీఎం అశోక్ గెహ్లాట్ పై మ‌రోసారి నిప్పులు చెరిగారు మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్(Sachin Pilot). ఆయ‌నను ప‌లుమార్లు కాంగ్రెస్ హైక‌మాండ్ హెచ్చ‌రించింది. కానీ ప‌ట్టించు కోలేదు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతిపై తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఒక రోజు దీక్ష చేప‌ట్టారు.

మంగ‌ళ‌వారం స‌చిన్ పైలట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. 2020లో కొంత మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటు చేశార‌ని, ఆ స‌మ‌యంలో వ‌సుంధ‌ర రాజే త‌న ప్ర‌భుత్వాన్ని రక్షించ‌డంలో స‌హాయం చేశార‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు సీఎం అశోక్ గెహ్లాట్.

రాజే బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు. ఒక‌ప్పుడు రాజ‌స్థాన్ రాష్ట్రానికి సీఎంగా కూడా ఉన్నారు. ఆమె పై ఎందుకు సానుకూల ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ నిల‌దీశారు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot). దీనినే హైలెట్ చేస్తూ వ‌చ్చారు. ఇక గెహ్లాట్ ను, సోనియా గాంధీని టార్గెట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాను అజ్మీర్ నుంచి జైపూర్ దాకా జ‌న్ సంఘ‌ర్ష్ యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు స‌చిన్ పైల‌ట్. త్వ‌ర‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త పోరు త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌స్తుతం ఆ పార్టీ ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది.

Also Read : ఏసీసీ నిర్ణ‌యం పీసీబీ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!