YS Jagan : సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం పూజారులు, వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని(YS Jagan) మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ . సత్యనారాయణ, వేద పండితులు ఆహ్వానం పలికారు.
ఇదిలా ఉండగా మే 12 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది. దీనిని ఏపీ ప్రభుత్వం – దేవాదాయా ధర్మాదాయ శౄఖ నిర్వహిస్తోంది. ఈ యాగంలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజ శ్యామల , సుదర్శన సహిత యజ్ఞం చేపడతారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. ఈ యాగం వల్ల రాష్టం బాగుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని నిర్వహిస్తున్నారు.
ఈ మహా యజ్ఞం కార్యక్రమానికి రాష్ట్రం నుంచి భక్తులు తండోప తండాలుగా హాజరు కావాలని దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తనను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
Also Read : 10న పదవ తరగతి ఫలితాలు