Siddaramaiah : ఓట‌ర్ల చూపు కాంగ్రెస్ వైపు – సిద్ద‌రామ‌య్య

కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంది

Siddaramaiah : క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓట‌ర్ల నుంచి విశేష‌మైన వ‌స్తోంద‌ని, ప్ర‌జ‌లు బారులు తీర‌డం ప్ర‌భుత్వం ప‌ట్ల త‌మ‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌ను తెలియ చేస్తోంద‌న్నారు . బుధ‌వారం అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటు వేశారు సిద్ద‌రామ‌య్య‌. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీకి 60 శాతం కంటే ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

స్వంతంగానే తాము అధికారాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌న్నారు సిద్ద‌రామ‌య్య‌. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాను పార్టీ నుంచి , రాజ‌కీయాల నుంచి వైదొలిగే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కానీ ఎన్నిక‌ల్లో ఇక నుంచి పోటీ చేయ‌నంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌లు అని ప్ర‌క‌టించారు సిద్ద‌రామ‌య్య‌.

ప్ర‌స్తుతం సీఎం రేసులో సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ మ‌ధ్య ఎవ‌రు అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదంటోంది. మ‌రోసారి తామే ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో మొత్తం 224 సీట్ల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 2,516 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఈనెల 13న ఫ‌లితాలు రానున్నాయి.

Also Read : క‌న్న‌డ‌నాట బారులు తీరిన ఓట‌ర్లు

Leave A Reply

Your Email Id will not be published!