మరాఠాలో రాచరిక పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. సీజేఐ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం చెంప చెళ్లుమనిపించేలా తీర్పు చెప్పింది.
ఆనాటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, స్పీకర్ చట్టాన్ని అతిక్రమించారని ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్దమని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సీఎంగా తిరిగి ఉద్దవ్ ఠాక్రేను కూర్చోబెట్టలేమంటూ తీర్పు సందర్బంగా వ్యాఖ్యానించారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు సంజయ్ రౌత్. షిండే, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సర్కార్ ను అక్రమ ప్రభుత్వం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరాఠాలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పూర్తిగా అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల ఒత్తిళ్ల మేరకే తనపై కావాలని కేసు నమోదు చేశారంటూ ఆరోపించారు. కానీ తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నాడు. నిరంకుశ పాలనపై ప్రజలు పోరాడలని సంజయ్ రౌత్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు.