DK Shiva Kumar Siddaramaiah : రాహుల్ తో సిద్దూ..డీకే భేటీ
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ తో ములాఖత్
DK Shiva Kumar Siddaramaiah : కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు మాజీ సీఎం సిద్దరామయ్య వైపు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపినట్లు టాక్. దీంతో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. చివరికి ఎంపిక చేసే అంశం పూర్తిగా రాహుల్ గాంధీ చేతిలోకి వెళ్లి పోవడంతో ఆయన తనకు డీకే శివకుమార్ ఎంతగా ఆప్తుడైనా ప్రస్తుతానికి సిద్దరామయ్యకు ఓటు వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో 224 సీట్లకు గాను 136 సీట్లు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. థంబింగ్ మెజారిటీ సాధించడంతో ఏ పార్టీపై కూడా ఆధార పడాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్దరామయ్య సైతం తాము సీఎం కావాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తాను రాజీనామా చేస్తున్నట్లు చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టారు డీకే శివకుమార్. తనకు పార్టీ తల్లి లాంటిదన్నారు.
తనకు సీఎం పదవి ఇవ్వక పోయినా సాధారణ ఎమ్మెల్యేగా పని చేస్తానని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో వేర్వేరుగా డీకే శివకుమార్ , సిద్దరామయ్య కలుసుకున్నారు. బుధవారం ఈ ఇద్దరు నేతలు విడిగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మే 18న సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Also Read : Parameshwara