CBI Summons : సమీర్ వాంఖడేకు సీబీఐ సమన్లు
రూ. 25 కోట్ల లంచం డిమాండ్ ఆరోపణలు
CBI Summons : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి కేసుకు సంబంధించి మాజీ యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేకు సీబీఐ ముంబై ఆఫీసుకు పిలిపించింది. ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన మాజీ డ్రగ్స్ నిరోధక అధికారికి సమన్లు జారీ చేసింది. దీంతో సమీర్ వాంఖడేకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆర్యన్ ఖాన్ ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకే ఈ ఆర్యన్ ఖాన్.
ఇదిలా ఉండగా సమీర్ వాంఖడే తో పాటు మరికొందరు మాదక ద్రవ్యాల దోపిడీ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఇరికించకుండా ఉండేందుకు గాను రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేశారని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా గతంలో ముంబై జోన్ లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి నాయకత్వం వహించారు సమీర్ వాంఖడే.
రెండు సంవత్సరాల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. వాంఖడే, ఇతరులు ఆరోపించిన డ్రగ్స్ కు సంబంధించి పేరు లేకుండా చేయాలంటే కోట్ల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపింది సీబీఐ. దీని వెనుక ప్రధాన సూత్రధారి సమీర్ వాంఖడే ఉన్నారని ఆరోపించింది.
మరో వైపు నాలుగు వారాల పాటు జైలులో గడిపాడు ఆర్యన్ ఖాన్. తగిన సాక్ష్యాలు లేనందు వల్ల మే , 2022లో డ్రగ్స్ వ్యతిరేక ఏజెన్సీ అన్ని ఆరోపణల నుండి క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read : Imran Khan