CM KCR : మనదే రాజ్యం మనదే ప్రభుత్వం – కేసీఆర్
95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ప్రకటన
CM KCR : భారత రాష్ట్ర సమితి కన్వీనర్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీసం 95 నుంచి 105 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రానున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ రాజ్యం మనదేనని కుండ బద్దలు కొట్టారు.
బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి వెళ్లాలి. వాళ్ల మధ్య ఉండాలి. ఎలాగైనా సరే గెలుపు సాధించాలని పిలుపునిచ్చారు సీఎం.
పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను , కార్యక్రమాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రగతి పథంలో తెలంగాణ దూసుకు పోతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం సీట్లు ఇస్తానని ప్రకటించారు. దేశానికి మన రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు కేసీఆర్. దేశ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితికి జనాదరణ లభిస్తోందన్నారు సీఎం. మనం ఏర్పాటు చేసిన మోడల్ కు బ్రహ్మరథం పడుతోందన్నారు. కులం, మతం ప్రాతిపదికన ఏ పార్టీ గెలవబోదన్నారు. అందరూ బాగుండాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు కేసీఆర్. ప్రతి ఒక్కరు గెలిచి తన ముందుకు రావాలన్నారు.
Also Read : KTR Warner Bros