Siddaramaiah CM DK Dy CM : సిద్దూ సీఎం డీకే డిప్యూటీ సీఎం
ఇద్దరూ రెండున్నర ఏళ్ల పాటు
Siddaramaiah CM DK Dy CM : నిన్నటి దాకా హాట్ టాపిక్ గా మారిన కర్ణాటక రాజకీయానికి చెక్ పడింది. ఏఐసీసీ మల్లగుల్లాలు పడిన తర్వాత ఎట్టకేలకు ఉత్కంఠకు తెరిదించింది. క్లీన్ ఇమేజ్ స్వంతం కలిగిన మాజీ సీఎం సిద్దరామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపింది. చివరకు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ఖరారు చేసింది. ఇద్దరినీ కూర్చోబెట్టి ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. ఈ మేరకు డీకే ఒప్పుకున్నట్లు సమాచారం.
సిద్దరామయ్యను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. మంత్రి వర్గ ఏర్పాటుపై దాదాపు చర్చలు పూర్తయ్యాయి. ఇద్దరూ సీఎం పోస్టును రెండున్నర ఏళ్ల పాటు ఒకరి తర్వాత మరొకరు పంచుకోనున్నారు. రాజీ ఫార్ములాను ముందుగా డీకే ఒప్పుకోలేదు. దీంతో రాహుల్ గాంధీ సిద్దరామయ్య వైపు చూపితే సోనియా గాంధీ డీకే వైపు ఉన్నారు. చివరకు అటు సిద్దూను ఇటు డీకేను ఇద్దరిని కలపడంలో మేడం కీలక పాత్ర పోషించారు.
నాలుగు రోజుల పాటు హై డ్రామా నడిచింది. ఇద్దరూ పట్టు వీడ లేదు. గత్యంతరం లేక సీన్ రాజధానికి మారింది. ఫైనల్ గా ఒకరు సీఎం మరొకరు డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు. ఇవాళ బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. సిద్దరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ఎన్నుకుంటారు. శనివారం ఆ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తారు.
Also Read : KTR