Sonia Gandhi DK Shiva kumar : డీకేను ఒప్పించిన సోనియా

ఎట్ట‌కేల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి

Sonia Gandhi DK Shiva kumar : క‌ర్ణాట‌కలో చోటు చేసుకున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది. అన్నీ తానై ముందుండి న‌డిపించి పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా చేసిన క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై త‌న‌కు ఎదురే లేకుండా గెలుస్తూ వ‌చ్చిన డీకే శివ‌కుమార్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చారు. తాను ముందు నుండి సీఎం పోస్టు కావాల‌ని కోరారు. ఆయ‌న‌తో పాటు క్లీన్ ఇమేజ్ క‌లిగిన నాయ‌కుడిగా సిద్దరామ‌య్య నిలిచారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వార్ న‌డిచింది. చివ‌ర‌కు పంచాయ‌తీ హిస్త‌న‌కు చేరింది.

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చెప్పి చూసినా లాభం లేక పోయింది. నాలుగు రోజుల పాటు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు రంగంలోకి దిగారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. గ‌త కొంత కాలం నుంచీ డీకే శివ‌కుమార్ కు వెన్నుద‌న్నుగా నిలుస్తూ వ‌చ్చారు సోనియా గాంధీ. చివ‌ర‌కు ఖ‌ర్గే సోనియాను సంప్ర‌దించారు. బంతి ఆమె కోర్టులోకి వ‌దిలారు. సిద్ద‌రామ‌య్య సీఎంగా, డీకే శివ‌కుమార్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌తిపాదించారు.

ఇద్ద‌రూ ఐదేళ్ల కాలంలో ఇద్ద‌రూ చెరో స‌గం ట‌ర్మ్ ను సీఎంగా కొన‌సాగేలా ఒప్పించారు. చివ‌ర‌కు సోనియా గాంధీ కీల‌క‌మైన పాత్ర పోషించారు. త‌న‌ను అభిమానించే డికే శివ‌కుమార్ కు డిప్యూటీ సీఎంతో పాటు తాను కోరిన మంత్రి ప‌ద‌వులు ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా క‌ర్ణాట‌క సంక్షోభానికి, ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు సోనియా గాంధీ. ఆమె మ‌రోసారి కీల‌క‌మైన నాయ‌కురాలి పాత్ర‌ను పోషించారు.

Also Read : Siddaramaiah CM DK Dy CM

Leave A Reply

Your Email Id will not be published!