DK Suresh : సంతోషంగా లేం పార్టీ కోసం తప్పదు
డీకే శివకుమార్ తప్పుడు డీకే సురేష్
DK Suresh : కర్ణాటకలో గత నాలుగు రోజులుగా చోటు చేసుకున్న ఉత్కంఠకు తెర దించింది ఏఐసీసీ. సీఎం పోస్టును ఇద్దరు పంచుకునేందుకు ఒప్పుకునేలా చేసింది. ఇందులో కీలక పాత్ర వహించారు సోనియా గాంధీ. ఆమె అంటే గౌరవం కలిగిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎట్టకేలకు డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించినట్లు సమాచారం. సిద్దరామయ్యను సీఎంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ కర్ణాటక రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
గురువారం డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ నిర్ణయం శిరోధార్యమైనప్పటికీ తాము మాత్రం డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వడం పట్ల సంతోషంగా లేమని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అసంబద్దం అని అర్థం వచ్చేలా మాట్లాడటం కలకలం రేపింది. ఇదిలా ఉండగా సీఎం పదవిని చెరి సగం పంచుకుంటారు. రెండున్నర ఏళ్లు సీఎంగా సిద్దరామయ్య కొనసాగుతారు.
మరో రెండున్నర ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఒప్పించారు. అంత వరకు డీకే డిప్యూటీగా కొనసాగుతారు. కీలకమైన శాఖలు కూడా ఆయన చెప్పిన వారికే ఇచ్చేలా కూడా పార్టీ హైకమాండ్ ఓకే చెప్పింది. చివరి దాకా ఒప్పుకోలేదు శివకుమార్ . కానీ సోనియా గాంధీ రంగంలోకి దిగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదని స్పష్టం చేశారు డీకే సురేష్.
Also Read : Kiran Rijiju