TTD EO Dharma Reddy : వేదిక్ హెరిటేజ్ కారిడార్ భేష్
అభినందించిన టీటీడీ ఈవో
TTD EO Dharma Reddy : వేదాలలోని విజ్ఞానాన్ని భావి తరాలకు తెలియ చేయడం కోసం వేదిక్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి(EO Dharma Reddy). ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ ప్రాంగణంలో వేదిక్ హెరిటేజ్ కారిడార్ ను ప్రారంభించారు. ఈ సందర్భం ఈవో ధర్మారెడ్డి(EO Dharma Reddy) ప్రసంగించారు. వేదాలు కొన్ని వేల సంవత్సరాల కిందటే అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ , గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారంతో పాటు 190 అంశాల గురించి ప్రత్యేకంగా తెలియ చేసిందన్నారు.
వీటి గురించి నేటి తరానికి, రాబోయే భావి తరాలకు తెలియ చేసే ప్రయత్నం చేయడం సంతోషకరమని ప్రశంసించారు. వీటికి సంబంధించి వేద విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి రచించిన సమ్ ఫాక్ట్స్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ , ఎస్సేస్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే రెండు పుస్తకాలను ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
వీటిని వేద విశ్వ విద్యాలయం ప్రచురించింది. ఈ సందర్బంగా మిగిలిన అంశాలపై కూడా పుస్తకాలు రచించాలని, వాటిని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేయాలని సూచించారు ఈవో ధర్మారెడ్డి. ఇదిలా ఉండగా రాణి సదాశివ మూర్తి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో వేద విజ్ఞానం ఏ విధంగా ఉపయోగ పడుతుందో తెలియ చేసేందుకు వేదిక్ హెరిటేజ్ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు.
Also Read : TTD Tickets