Sonia Gandhi : రాజీవ్ గాంధీకి సోనియా నివాళి
నీవు ఎల్లప్పటికీ నా వాడివే
Sonia Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) తన భర్త మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో రాజీవ్ సమాధి వద్దకు ఆదివారం చేరుకున్నారు. ఆమెతో పాటు తనయుడు రాహుల్ గాంధీ, తనయురాలు ప్రియాంక గాంధీతో కలిసి రాజీవ్ కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ప్రతి ఏటా మే 21న నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ ఆయన వర్దంతి కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. సరిగ్గా ఇదే రోజు 32 ఏళ్ల కిందట రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ప్రాణాలు కోల్పోయారు.
శ్రీలంకలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత దేశం నుంచి దళాలను పంపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎల్టీటీఈ సంస్థ. ప్రభాకరన్ ఆధ్వర్యంలో బిగ్ ఆపరేషన్ జరిగింది. చివరకు తమను పొట్టన పెట్టుకునేలా శ్రీలంక రాచరిక ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు ఏకంగా రాజీవ్ గాంధీని లేపేసే ప్లాన్ చేశారు ఎల్టీటీఈ చీఫ్.
ఇదిలా ఉండగా దోషులకు జీవిత ఖైదు విధించారు. చివరకు క్షమాభిక్ష ప్రసాదించింది కోర్టు. ఇందుకు ఒప్పుకున్న ఘనత సోనియా గాంధీ కుటుంబానికే దక్కుతుంది. మొత్తంగా ఒక స్వాప్నికుడిని, ఒక భవిష్యత్తు తరం గుర్తుంచుకునే నాయకుడైన రాజీవ్ గాంధీని కోల్పోవడం బాధాకరం.
Also Read : Rahul Priyanka Gandhi