PM Modi Tribute : రాజీవ్ గాంధీ అరుదైన నేత – మోదీ
32వ వర్ధంతి సందర్భంగా నివాళి
PM Modi Tribute : దివంగత దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 32వ వర్దంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM MOdi) ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ దేశాన్ని ప్రభావితం చేసిన అరుదైన నాయకులలో రాజీవ్ గాంధీ ఒకరు అని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఈ దేశానికి టెక్నాలజీని అందించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు పీఎం. ప్రస్తుతం నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతి ఏటా రాజీవ్ గాంధీ జయంతి, వర్దంతి సందర్బంగా నివాళులు అర్పిస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీని 1991లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబులతో దాడి చేశారు. అక్కడికక్కడే రాజీవ్ గాంధీతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు యావత్ దేశం తల్లడిల్లి పోయింది రాజీవ్ మరణ వార్తను విని. ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ భారత దేశానికి 1984 నుండి 1989 మధ్య కాలంలో ప్రధానమంత్రిగా పని చేశారు. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. టెలికాం వ్యవస్థకు ప్రాణం పోశారు. ఆనాడే టెక్నాలజీ వినియోగం, ప్రాధాన్యత గురించి గుర్తించారు.
Also Read : Sonai Gandhi