YV Subba Reddy : ఆర్జిత సేవలు..విఐపీ దర్శనాల్లో మార్పులు
టీటీడీ చైర్మన్ సుబ్బా రెడ్డి కామెంట్స్
YV Subba Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవులు కావడంతో పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులు దర్శనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నారు. ప్రతి రోజూ స్వామి వారికి సంబంధించి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
మరో వైపు కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగి పోవడం, వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో బక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. సర్వ దర్శనం భక్తులకు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆది వారాల్లో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి వెల్లడించారు. సుప్రభాత సేవకు కోటాను రద్దు చేయడం జరిగిందన్నారు.
దీని వల్ల 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తామని దీని వల్ల 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపారు టీటీడీ చైర్మన్. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. దీని వల్ల మూడు గంటల సమయం ఆదా అవుతుందన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
Also Read : AICC Focus