Nitish Kumar : కేంద్రంపై కలిసి పోరాడుదాం – నితీశ్
ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో
Nitish Kumar : కేంద్రం వర్సెస్ ఆప్ మధ్య యుద్దం ముదిరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా కర్ణాటకలో ఎన్నికలు జరగడం కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కలిసి హాజరయ్యారు.
తాజాగా ఆయన సంచలన ప్రతిపాదన చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాలను కూడగట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నుకోబడిన ప్రభుత్వం నుండి అధికారాన్ని ఎలా లాక్కుంటారని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంలో నితీశ్ తనకు పూర్తి మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే లక్ష్యంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. రాజ్యసభ ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ కీలక మీటింగ్ కు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా హాజరయ్యారు.
ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా సప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ ను కేంద్రం తప్పించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు కేజ్రీవాల్. ఈ విషయంపై నితీశ్ కుమార్ తనకు పూర్తి మద్దతు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : YV Subba Reddy