Arvind Kejriwal : కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్దం
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : కేంద్రం, ఢిల్లీ ఆప్ సర్కార్ మధ్య యుద్దం మళ్లీ మొదలైంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు మాత్రమే జోక్యం చేసుకునేందుకు పవర్స్ ఉంటాయని , మిగతా మొత్తం అంశాలు ప్రజలతో ఎన్నుకోబడిన ఆప్ సర్కార్ కు ఉంటుందని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి సర్వాధికారాలు కేబినెట్ కు ఉంటాయని పేర్కొంది. దీంతో ఎల్జీ సక్సేనా కావాలని సంతకాలు చేయడం లేదని, ఫైళ్లను పంపడం లేదంటూ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం 5-0 తేడాతో ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలను ఇచ్చింది. కాగా ఎనిమిది రోజుల తర్వాత కేంద్రం అందుకు విరుద్దంగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ అన్యాయంపై ఢిల్లీ ప్రజలతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆదివారం సీఎం ఢిల్లీలో నితీశ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఈ బిల్లు వీగి పోవచ్చన్నారు కేజ్రీవాల్.
Also Read : Nitish Kumar