BS Yedyurappa : భవనం ఖాళీ చేసిన యెడ్యూరప్ప
కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం
BS Yedyurappa : రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. ఒకప్పుడు పలకరించిన వాళ్లు, ఆదరించిన వాళ్లు, సకల మర్యాదలు చేసిన వాళ్లు ఉన్నట్టుండి పదవి పోయేసరికల్లా కనిపించకుండా పోతారు. ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీని కూడా కేంద్రం ఘోరంగా అవమానించింది. ఆయనపై కోర్టు తీర్పు వెలువడగానే లోక్ సభలో అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆ వెంటనే సమయం కూడా ఇవ్వకుండానే అధికారిక భవనం ఖాళీ చేయాలంటూ ఆదేశించింది. చివరకు ఆయన ఆలస్యం చేయకుండా వెళ్లి పోయారు.
తాజాగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. దక్షిణాదిన కాషాయ పార్టీకి జీవం పోసిన వ్యక్తి. ఆ పార్టీని కన్నడ నాట పవర్ లోకి తీసుకు వచ్చిన అపర చాణక్యుడు. ప్రముఖ లింగాయత్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. ఆపై సీఎంగా కూడా పని చేశారు బీఎస్ యడ్యూరప్ప(BS Yedyurappa). తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. 65 సీట్లకే పరిమితమైంది. 136 సీట్లతో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉన్నట్టుండి తనంతకు తానుగా అధికారానికి చెందిన కావేరీ నివాసంలో ఉన్న మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఖాళీ చేశారు. ఆదివారం ఆయన వెళ్లి పోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. నెట్టింట్లో హల్ చేశాయి. ఎంతైనా పవర్ ఉంటేనే పలకరింపు కదూ అంటున్నారు తెలిసిన వారు.
Also Read : Nara Lokesh