DK Shiva Kumar : 135 సీట్లతో సంతోషంగా లేను – డీకే
కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ,పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్(DK Shiva Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు సాధించింది. అత్యధిక మెజారిటీ సాధించిన ఏకైక పార్టీగా అవతరించింది. 20న శనివారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు ఎనిమిది మంది క్యాబినెట్ లో కొలువు తీరారు.
ఆదివారం పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి డీకే శివకుమార్ ప్రసంగించారు. తాను అనుకున్న టార్గెట్ చేరుకోలేదన్నారు కేపీసీసీ చీఫ్. తమ అంచనా కనీసం 146 సీట్లు రావాల్సి ఉందని కానీ కేవలం 135కే పరిమితమైందని ఇది తనను సంతోష పెట్టడం లేదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు మనకు అత్యంత కీలకం కానున్నాయని చెప్పారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. 20 లోక్ సభ సీట్లలో మనం జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.
ఇక నుంచి ప్రతి సర్వే లోనూ కాంగ్రెస్ మంచి పనితీరు కనబర్చేలా పాటు పాడాలని స్పష్టం చేశారు. అంతా కష్టపడాలని , ఏ ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు లొంగ వద్దని కోరారు డీకే శివకుమార్. ఇది ప్రారంభం మాత్రమేనని మన ముందు భారీ లక్ష్యం ఉందన్నారు డిప్యూటీ సీఎం. ఓటు శాతం మరింత మెరుగు పడాలని కోరారు.
Also Read : Arvind Kejriwal