Akhilesh Yadav : కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav : కేంద్రం అనుస‌రిస్తున్న తీరు పూర్తిగా రాజ్యాంగానికి విరుద్దంగా ఉంద‌న్నారు స‌మాజ్ వాదీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav). ఆయ‌న మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌మానించేలా కేంద్రం ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఆరోపించారు. ఢిల్లీ పోస్టింగ్ ల‌పై కేంద్రం ఆదేశాలు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది ఒక ర‌కంగా న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌మానించ‌డం త‌ప్ప మ‌రొకటి కాద‌ని పేర్కొన్నారు. ఇవాళ అఖిలేష్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు.

ఇది ఆర్డినెన్స్ పేరుతో మాండేట్ హ‌త్య అని మండిప‌డ్డారు. ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు స‌మాజ్ వాదీ పార్టీ పూర్తిగా మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ రాజ‌ధానిలో సేవ‌ల‌పై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయ‌డం పూర్తిగా ప్ర‌జాస్వామ్య విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు అఖిలేష్ యాద‌వ్. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీ లోని అన్ని స్థానాల్లోను ఓడి పోతామ‌ని బీజేపీకి తెలుస‌న్నారు. అందుకే ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తీకారం తీర్చుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండ‌గా ఐఏఎస్ , డీఏఎన్ఐసీఎస్ క్యాడ‌ర్ అధికారుల‌ను బ‌దిలీ చేసేందుకు , వారిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకునే అధికారం క‌లిగిన నేష‌న‌ల్ క్యాపిట‌ల్ స‌ర్వీస్ అథారిటీని రూపొందించేందుకు కేంద్రం ప్ర‌త్యేకంగా ఆర్డినెన్స్ ప్ర‌క‌టించింది. దీనిని తీవ్రంగా తప్పు ప‌ట్టారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : DK Shiva Kumar

Leave A Reply

Your Email Id will not be published!