Amit Shah : జనన..మరణ డేటా లింక్ పై బిల్లు
తీసుకు వస్తామన్న అమిత్ చంద్ర షా
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఒకే చట్టం, ఒకే భాష, ఒకే నాగరికత ఉండాలని కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు. ఉమ్మడి పౌరసత్వం పై కూడా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు అమిత్ షా(Amit Shah). ఎలక్టోరల్ రోల్స్ తో జనన, మరణ వివరాలను లింక్ (అనుసంధానం) చేసేందుకు కేంద్రం బిల్లును తీసుకు రానున్నట్లు స్పష్టం చేశారు.
జనన, మరణ ధృవీకరణ పత్రాలను ప్రత్యేక పద్దతిలో భద్రపర్చినట్లయితే అభివృద్ది పనులను సరిగా ప్లాన్ చేయొచ్చని కేంద్ర హోం శాఖ మంత్రి వెల్లడించారు. డిజటల్, పూర్తి, కచ్చితమైన జనాభా లెక్కలు బహుళ డైమెన్షనల్ ప్రయోజనాలను కలిగి ఉంటాయని అమిత్ షా చెప్పారు.
జనన మరణాలకు సంబంధించిన డేటాను ఓటర్ల జాబితాతో పాటు మొత్తం అభివృద్ది ప్రక్రియకు అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును తీసుకు రావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. భారత రిజిస్ట్రార్ , జనరల్ , సెన్సస్ కమీషనర్ కార్యాలయం జనగణన భవన్ ను ప్రారంభించారు షా. జనాభా గణన అనేది అభివృద్ది ఎజెండాకు ఆధారం అయ్యే ప్రక్రియ అని స్పష్టం చేశారు.
జనాభా గణన డేటా వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. జనన మరణాల నమోదు చట్టం ,1969 సవరణ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ , పాస్ పోర్ట్ జారీకి సంబంధించిన విషయాలను కూడా సులభతరం చేస్తుందన్నారు షా.
Also Read : Lauren Sanchez