Lawrence Bishnoi : లారెన్స్ హిట్ లిస్టులో 10 మంది
సల్మాన్ ఖాన్ తో పాటు మరికొందరు
Lawrence Bishnoi : గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ తో పాటు మరో పది మంది ప్రముఖులు ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే సల్మాన్ కు భారీ భద్రతను పెంచారు. ఏదో ఒక రోజు లేపేస్తానంటూ లారెన్స్ ప్రకటించారు. స్వయంగా సల్మాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1998లో బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ వేటాడాడని , అందుకే తాను చంపాలని అనుకుంటున్నట్లు చెప్పాడు లారెన్స్ బిష్ణోయ్. దీంతో సల్మాన్ కు ముప్పు పొంచి ఉండడంతో వైప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు.
ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు లారెన్స్. బిష్ణోయ్ గత ఏడాది డిసెంబర్ లో ఎన్ఐఏ ఎదుట తన ఆదేశాల మేరకు తన సహాయకుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ముంబై నివాసంలో రెక్కీ నిర్వహించాడని అంగీకరించాడు. దీంతో నెహ్రాను హర్యానా పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. దీంతో రెక్కీ సీక్రెట్ బయట పడింది.
ఈ ఏడాది ఏప్రిల్ 11న సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపుకాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఇమెయిల్ పంపినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బిష్ణోయ్ 2021లో గోగి గ్యాంగ్ కోసం గోల్డీ బ్రార్ ద్వారా అమెరికా నుంచి 2 జిగానా సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లను సేకరించాడు.
Also Read : Arjun Meghwal