Mamata Banerjee : కేంద్రం నిర్వాకం దీదీ ఆగ్రహం
సుప్రీంకోర్టు తీర్పు గౌరవించక పోతే ఎలా
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎంతో మర్యాద పూర్వకంగా కలిశారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఎంపీలు సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దా, విద్యా శాఖ మంత్రి అతిషి మమతా బెనర్జీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి తన మద్దతు తెలిపారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం కావాలని కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని, ఎవరికి సర్వాధికారాలు ఉంటాయనే దానిపై స్పష్టత కూడా ఇచ్చిందన్నారు. కానీ సుప్రీం తీర్పును పక్కన పెట్టి కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు రావడం దారుణమన్నారు. అసలు మోదీకి, ఆయన పరివారానికి ఈ దేశం పట్ల , భారత రాజ్యంగం పట్ల గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంత సేపు కులం, మతం, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం రాజకీయంగా లబ్ది పొందడం తప్పితే ఇంకే పనీ లేదన్నారు.
ప్రధానంగా బీజేపీయేతర పార్టీలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు , ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యం పేరుతో మోదీ రాచరిక పాలన సాగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు దీదీ.
Also Read : Nara Lokesh