RS Praveen Kumar : యూనివర్శిటీ ప్యానల్ పై ఆర్ఎస్పీ ఫైర్
అంబేద్కర్ కోర్సును విరమించాలని ప్రతిపాదన
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ ప్యానల్ అంబేద్కర్ కోర్సును విరమించు కోవాలని ప్రతిపాదన చేయడాన్ని తప్పు పట్టారు. భారత దేశానికి రాజ్యాంగ ప్రదాత అయిన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గురించిన కోర్సును తీసివేయాలని, పక్కన పెట్టాలని ప్రతిపాదించడం దారుణమని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం తమకు నచ్చిన భావజాలాన్ని మాత్రమే చదువులో చేర్చాలని అనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు.
అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కోట్లాది మంది ప్రజలను నేటికీ స్పూర్తి కలిగిస్తున్న ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం ఆహ్వానించ దగిన పరిణామం కాదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందని దానిని కూడా పాడు చేయాలని చూడడం మంచి పద్దతి కాదని సూచించారు ఆర్ఎస్పీ.
ఇదిలా ఉండగా యూనివర్శిటీ ప్యానల్ కమిటీ చేసిన సిఫార్సును ఫిలాసఫీ శాఖ పూర్తిగా వ్యతిరేకించింది. ఈ దేశానికి దిక్సూచి, అంతే కాదు రాజ్యాంగ నిర్మాత కోట్లాది మందికి స్పూర్తి ప్రదాత. భావి తరాలు గుర్తుంచుకునే మహనీయుడు అంబేద్కర్. ఇవాళ నిమ్న వర్గాలు చదువు కుంటున్నాయంటే ఆయన వల్లనేనని పేర్కొన్నారు బీఎస్పీ. వెంటనే ఈ ప్రతిపాదనను విరమించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Mamata Banerjee