DK Shiva Kumar : ప్రజలకు మేలు జరగేలా చూడాలి
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : ప్రజలు ఎన్నో ఆశలతో తమను గెలిపించారని వారిని తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar). ఇవాళ విధాన సౌధలో ప్రభుత్వ కార్యదర్శులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఎవరు ఏం చేశారనేది తమ వద్ద వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ తాము ఎవరినీ వేధింపులకు గురి చేయాలని అనుకోవడం లేదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తమ ధ్యేయమన్నారు.
తమ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. ప్రజా హితమే పరమావధిగా తాము పని చేయాలని అనుకుంటున్నామని ఇందుకోసం ప్రభుత్వ పరంగా ఉద్యోగులు, ఉన్నతాధికారులు సహకరించాలని కోరారు డీకే శివకుమార్. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, ఏదైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా విన్నవించాలని సూచించారు. పనిగట్టుకుని వేధింపులకు పాల్పడ కూడదని స్పష్టం చేశారు.
తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు డీకే శివకుమార్. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో జాప్యం జరగకుండా చూడాలని అన్నారు.
Also Read : RS Praveen Kumar