Chandrababu Naidu : నేరస్థులు న్యాయం చేస్తారా
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలదంతా నేర చరిత్రేనని ఆరోపించారు. మొత్తం 408 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏకంగా 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ న్యాయ ఖర్చులు 70 శాతం పెరిగాయని ఆరోపించారు. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని మండిపడ్డారు. నేరస్థులే పాలకులైతే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలేశారని, పాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని త్వరలోనే అది వాస్తవ రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. స్వంత బాబాయిని చంపింది ఎవరో ప్రజలకు తెలియదా అనినారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. స్వంత ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోందని ఇది ఒక ప్రభుత్వమేనా అని నిలదీశారు. జనం జగన్ పాలనను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ చీఫ్.
Also Read : Smriti Mandana