GVL Narasimha Rao : సీబీఐని ఏ శక్తి ఆపలేదు – జీవిఎల్
అవినాష్ అరెస్ట్ పై షాకింగ్ కామెంట్స్
GVL Narasimha Rao : భారతీయ జనతాపార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరెస్ట్ పై ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ముందుగా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రానికి సీబీఐతో సంబంధం ఉండదన్నారు. అది కేంద్ర దర్యాప్తు సంస్థ తన పని తాను చేసుకుంటూ వెళుతుందని చెప్పారు.
సరైన ఆధారాలు ఉంటే రంగంలోకి దిగుతుందని , పక్కా ప్రూఫ్స్ తో అరెస్ట్ చేస్తుందని తెలిపారు. అరెస్ట్ చేసే ముందు వాళ్లు ఏ పార్టీకి చెందిన వారని చూడరని అన్నారు జీవీఎల్ నరసింహా రావు. ఫ్యాక్షనిజం, గూండాయిజం ఒత్తిళ్లకు కేంద్ర సర్కార్ తల వంచదని చెప్పారు. ఎవరైనా సరే ఎంతటి స్థాయిలో ఉన్నా సరే చివరకు మా పార్టీకి చెందిన వారైనా సరే తప్పులు చేస్తే , అక్రమాలకు పాల్పడితే, నేరాలు చూస్తే సీబీఐ ఊరుకోదన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చాకే కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ లభించిందన్నారు. లేక పోతే నిర్వీర్యమై ఉండేవన్నారు. ఇవాళ సీబీఐ, ఈడీ, ఐటీ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నాయని చెప్పారు.
Also Read : TS EAMCET Results