Modi Govt Failure : ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలం
సీఎస్డీఎస్ - ఎన్డీటీవీ సర్వేలో షాక్
Modi Govt Failure : మోదీ ప్రభ తగ్గుతోందా. తన పాలన పట్ల జనం ఆసక్తిని కనబర్చడం లేదా. అవుననే సమాధానం వస్తోంది జనం నుంచి. తాజాగా సీఎస్డీఎస్ – ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశంలో చోటు చేసుకున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రభుత్వం విఫలమైందని(Modi Govt Failure) స్పష్టమైంది. సర్వేలో ఏకంగా 57 శాతం మంది అవుననే సమాధానం చెప్పడం విశేషం.
ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో కేవలం ఉన్నత వర్గాలకు లాభం చేకూర్చి పెట్టేలా, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ పేర్కొన్నారు సర్వేలో. అచ్చే దిన్ రాలేదని 42 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని 22 శాతం మంది తెలిపారు.
మోదీ ప్రభుత్వం పూర్తిగా ధనవంతుల సర్కార్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 36 శాతం మంది అవునని పేర్కొన్నారు. 18 శాతం ఎవరూ దేశాన్ని అభివృద్ది చేయలేదని స్పష్టం చేశారు. చైనాతో సరిగా వ్యవహరించ లేక పోయిందంటూ పేర్కొన్నారు. 28 శాతం మంది పూర్తిగా మోదీ విఫలం చెందారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : GVL Narasimha Rao