CM MK Stalin : ‘అముల్’ ప్రవేశం ప్రమాదం – స్టాలిన్
కేంద్ర హోం శాఖ షాపై తీవ్ర ఆగ్రహం
CM MK Stalin : నిన్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా అముల్ తన వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ చేయడాన్ని తీవ్రంగా నిరసించింది కాంగ్రెస్ పార్టీతో పాటు రైతులు, వ్యాపారులు. అక్కడ ప్రభుత్వానికి చెందిన నందిని సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా అముల్ సంస్థ తమిళనాడులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). హిందీ భాషను అమలు చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో అముల్ రాష్ట్రంలోకి రానున్నట్లు చేసిన ప్రకటనపై భగ్గుమన్నారు.
ఈ మేరకు గురువారం సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అముల్ తమిళనాడులో పని చేయాలని తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలకు హానికరమని స్పష్టం చేశారు. అముల్ రాకతో సహకార సంఘాల మధ్య అనారోగ్య కరమైన పోటీని కలుగ చేస్తుందని మండిపడ్డారు సీఎం ఎంకే స్టాలిన్. ప్రాంతీయ సహకార సంఘాలు రాష్ట్రాలలో డెయిరీ (పాల) అభివృద్దికి పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు ఉత్తమంగా ఉంచబడ్డాయని తెలిపారు ఎంకే స్టాలిన్. ఈ మేరకు వెంటనే వాటిని నిలిపి వేయాలని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కోరుతున్నానని తెలిపారు. ఆవిన్ మిల్క్ షెడ్ ప్రాంతం నుండి పాలను సేకరించడం మానుకోవాలని స్పష్టం చేశారు సీఎం.
Also Read : FIR BJP Leaders