New Parliament Row : పార్లమెంట్ పై పిటిషన్ దాఖలు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
New Parliament Row : కొత్తగా నిర్మించిన పార్లమెంట్(New Parliament) ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశానికి సంబంధించి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అధిపతి అని , కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని దావాలో కోరారు. ఇదిలా ఉండగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే విపక్షాలు తాము హాజరు కాబోమంటూ ఇప్పటికే ప్రకటించాయి. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
మే 18న లోక్ సభ సచివాలయం విడుదల చేసిన ప్రకటన రాజ్యాంగ విరుద్దమని పిటిషన్ లో పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్ సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానాలు రాజ్యాంగ ఉల్లంఘనేనని న్యాయవాది జయ సుకిన్ దావాలో స్పష్టం చేశారు. రాష్ట్రపతి భారత దేశ ప్రథమ పౌరుడని, పార్లమెంట్ కు చీఫ్ అని కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా కేంద్ర సర్కార్ ను ఆదేశించాలని విన్నవించారు.
ఆర్టికల్ 87 ప్రకారం ప్రతి పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి. ఇందుకు సంబంధించి కారణాలను పార్లమెంట్ కు తెలియ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 20 ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నిర్ణయాన్ని తప్పు పట్టాయి.
Also Read : Ashish deshmukh