TDP Mahanadu : 27,28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు
ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
TDP Mahanadu : ఏపీలోని రాజమండ్రి మరో కీలకమైన మహోత్సవానికి వేదిక కానుంది. దివంగత సీఎం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు(TDP Mahanadu) ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించి టీడీపీ ప్రకటించింది. మే 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఈసారి రెండు చోట్ల వేదికలు ఏర్పాటు చేసింది. మహానాడు నిర్వహణ కోసం 15 కమిటీలు నియమించింది. 28న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు 15 లక్షల మంది హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ వేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా జరిగిన పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. వరుస విజయాలతో జోష్ మీదుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్నారు. లోకేష్ యువ గళం పేరుతో ఇప్పటికే 110 రోజుల పర్యటన పూర్తయింది.
Also Read : UT Khader Speaker