Praveen Sood : సీబీఐ డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్
ముగిసిన జైస్వాల్ పదవీ విరమణ
Praveen Sood : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్(Praveen Sood) గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాల్టితో ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం ముగిసింది. ఇదిలా ఉండగా కర్ణాటకకు చెందిన ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ సూద్ ఐజీగా పని చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, సీజేఐ ధనంజయ చంద్రచూడ్ తో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
జైస్వాల్ మహారాష్ట్ర కేడర్ కు చెందిన అధికారి. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ డైరెక్టర్ గా కొలువు తీరారు. గతంలో ప్రవీణ్ సూద్ కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. త్రిసభ్య కమిటీ మధ్యప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ఫైర్ అండ్ హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ తాజ్ హసన్ పేర్లను కూడా త్రిసభ్య కమిటీ పరిశీలించింది. చివరికి ప్రవీణ్ సూద్ వైపు మొగ్గు చూపింది కమిటీ.
ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం ఆయనను సీబీఐ కీలక డైరెక్టర్ గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక కేడర్ 1986 బ్యాచ్ కు చెంందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్. ఆయన రెండేళ్ల పాటు డైరెక్టర్ గా కొనసాగనున్నారు.
Also Read : TTD IT Wing Case File