Revanth Reddy : బీఆర్ఎస్ ఖతం కాంగ్రెస్ ఖాయం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిప్పులు చెరిగారు. జడ్చర్లలో జరిగిన పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేవలం నాలుగు నెలలు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. అంత వరకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఇక బీఆర్ఎస్ ఖతం కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
కులాల పేరుతో విడదీసి ఓట్ల రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మార్పు ఖాయమని దొరల పాలనను అంతం చేసేందుకు జనం రెడీగా ఉన్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. గొర్రెలు, గేదెలు, చేపలు అంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్న నయా నిజాం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలు తేలుస్తారని అన్నారు. మలి దశ ఉద్యానికి ఊపిరి పోసింది పాలమూరు జిల్లా అని దానిని నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వలసలు ఆగలేదన్నారు.
ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటున్నాడంటూ మండిపడ్డారు. జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఏమైందని ప్రశ్నించారు.
Also Read : Bhatti Vikramarka Mallu