Karnataka Portfolios : సీఎంకు ఫైనాన్స్ ఖర్గేకు హోమ్
కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపు
Karnataka Portfolios : కర్ణాటకలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖలు కేటాయింపు జరిగింది. సీఎం రేసులో నువ్వా నేనా అన్న పోటీలో చివరకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సిద్దరామయ్య(Siddaramaiah) వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. ఇదే సమయంలో డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. ఇదే సమయంలో ఎనిమిది మందికి మొదటి విడతలో మంత్రి పదవులను కేటాయించింది.
ఇక రెండో విడతలో ఎంత మందికి ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా సర్కార్ కొలువు తీరినా ఇప్పటి వరకు శాఖలు కేటాయించ లేదు. దీంతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు హుటా హుటిన ఢిల్లీకి వేర్వేరుగా బయలు దేరి వెళ్లారు . పార్టీ హైకమాండ్ తో చర్చించారు. ఇక ఎప్పటి లాగే ఏఐసీసీ చీఫ్ గా ఉన్న కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గేకు కీలకమైన శాఖలు ఇప్పించు కోగలిగారు.
తాజాగా ప్రకటించిన శాఖల పరంగా చూస్తే సీఎం సిద్దరామయ్యకు కీలకమైన ఫైనాన్స్ శాఖ లభించింది. దానితో పాటు బెంగళూరు అర్బన్ డెవలప్ మెంట్ కూడా దక్కింది. ఇక కర్ణాటక పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు గతంలో పని చేసిన నీటి పారుదల శాఖనే దక్కింది. నీటి వనరులు అదనంగా చేరింది. ఇక ఊహించని రీతిలో ఖర్గే కొడుక్కి ఐటీ, హోమ్ మంత్రిత్వ శాఖలు లభించడం విస్తు పోయేలా చేసింది. సాధ్యమైనంత మేరకు డీకే శివకుమార్ కు దక్కుతుందని అంతా భావించారు. కానీ దెబ్బ పడింది.
ఇక సతీష్ జార్కీ హోళీకి సాంఘిక సంక్షేమం శాఖ దక్కగా, ధిక్కార స్వరం వినిపించిన దళిత కమ్యూనిటీకి చెందిన జి. పరమేశ్వరకు పవర్ శాఖ అప్పగించారు.
Also Read : Ashwath Narayan