PM Modi Govt Failure : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల వైఫల్యం
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ
PM Modi Govt Failure : జాతీయ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ఈ మేరకు మే 26తో బీజేపీ సంకీర్ణ సర్కార్ ముచ్చటగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాధించిన విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. మోదీని(Modi) ఫెయిల్యూర్ ప్రధానిగా పేర్కొంది.
మోదీ(Modi) పాలనలో అవినీతి, అక్రమాలు, వ్యాపారస్తులు పెరిగి పోయారని ఆరోపించింది. ఈ తొమ్మిదేళ్ల కాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నియంతృత్వ నిర్ణయాల భారాన్ని ప్రజలు భరించాల్సి వచ్చిందని పేర్కొంది.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చ లేదని, అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలి పోయాయని ధ్వజమెత్తింది. నల్ల ధనం తీసుకు వస్తానని , ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. కానీ ఒక్క పైసా కూడా రాలేదని మండిపడింది పార్టీ. ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ కనీసం పట్టుమని 10 లక్షల జాబ్స్ ఇవ్వలేక పోయారని ఇవన్నీ వైఫల్యాలు తప్ప విజయాలు ఎలా అవుతాయని ప్రశ్నించింది.
తన అజ్ఞానంతో దేశాన్ని ఇబ్బందుల్లోకి, అప్పుల్లోకి నెట్టి వేశారంటూ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, జనం డబ్బులు లేక, ఉపాధి దొరకక చని పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. జీఎస్టీ వల్ల వ్యాపారులకు లాభం తప్ప పేదలకు చిప్ప మాత్రమే మిగిలిందంటూ ధ్వజమెత్తింది.
Also Read : Dhwajarohanam TTD