Arvind Kejriwal Rahul : రాహుల్ తో భేటీకి కేజ్రీవాల్ సిద్దం
భేటీకి ప్రాధాన్యత ఇవ్వనున్న ఆప్ చీఫ్
Arvind Kejriwal Rahul : దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న పార్టీలన్నీ ఇప్పుటు ఏక తాటిపైకి రానున్నాయి. ఈ మేరకు ఆప్ , కాంగ్రెస్ పార్టీల మధ్య గత కొంత కాలం పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా వ్యవహరించాయి. కానీ తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఇరు పార్టీలను దగ్గరయ్యేలా మార్చేశాయి. ఇందుకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని ఢిల్లీ సర్కార్ పై పెత్తనం చెలాయించేందుకు ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
దీనిని పాస్ కుండా చేసేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం(Arvind Kejriwal) ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు. వారి నుంచి తనకు పూర్తి మద్దతు లభించింది. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. దీంతో లోక్ సభలో ఆర్డినెన్స్ గెలుపొందినా రాజ్యసభలో ఇబ్బంది కరంగా మారనుంది.
కేంద్రంపై పోరాడేందుకు అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలతో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు మాజీ ఎంపీ రాహుల్(Rahul) గాంధీతో భేటీ కావాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా కూడా తెలియ చేశారు. దీంతో ఆప్, కాంగ్రెస్ మధ్య దోస్తానా ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. ఇద్దరు గనుక ములాఖత్ అయితే దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.