Siddaramaiah Meet : సోనియా..రాహుల్ తో సిద్దరామయ్య భేటీ
మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు
Siddaramaiah Meet : కర్ణాటక సీఎం సిద్దరామయ్య బిజీగా ఉన్నారు. ఆయన అధికారికంగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు స్పీకర్, ఎనిమిది మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు. గరిష్టంగా 34 మందికి చోటు కల్పించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు కీలకంగా వ్యవహరించినా సోనియా గాంధీనే సుప్రీం కావడంతో సిద్దరామయ్య(Siddaramaiah) మేడంతో శుక్రవారం భేటీ అయ్యారు. తల్లీ కొడుకులతో సుదీర్ఘంగా చర్చించారు సీఎం. కర్ణాటకలో 224 సీట్లకు గాను 135 సీట్లు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఊహించని రీతిలో ఆ పార్టీకి ఆక్సిజన్ లాగా ఉపయోగ పడింది ఈ రిజల్ట్స్.
ఇదే సమయంలో ఈ ఇద్దరితో సిద్దరామయ్య ప్రధానంగా కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి సీఎంకు ఫైనాన్స్ , డీకే కు నీటి పారుదల, జార్కి హొళీకి సాంఘిక సంక్షేమం, జి. పరమేశ్వరకు పవర్ శాఖలు కేటాయించినట్లు టాక్. మొత్తంగా 34 మంది కాక పోయినప్పటికీ కొత్తగా మరో 20 మందికి చోటు దక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సోనియా గాంధీతో సిద్దరామయ్య కలవడం ఇదే తొలిసారి. సీఎం, డిప్యూటీ సీఎంలు రణ్ దీప్ సూర్జే వాలా, కేసీ వేణుగోపాల్ , ఖర్గేలతో భేటీ అయ్యారు.
Also Read : Rahul Gandhi Passport