YS Jagan Delhi Tour : హస్తిన బాట పట్టిన వైఎస్ జగన్
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
YS Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హిస్తన బాట పట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడుపుతారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి బయలు దేరి వెళతారు. ఇదిలా ఉండగా ఈనెల 27న శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 8వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే కేంద్ర సర్కార్ ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డికి(Jagan Mohan Reddy) ఆహ్వానం పంపింది. ఈ మేరకు జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారు.
అంతే కాకుండా భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సం మే 28న ఆదివారం జరగనుంది. దీనిని ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు దీని కోసం ఖర్చు చేశారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు ఆహ్వానం అందజేసింది కేంద్రం.
ఇప్పటికే కేంద్ర సర్కార్ కు వైఎస్ జగన్ రెడ్డి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. దీంతో తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా మరోసారి ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులతో ప్రస్తావించనున్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. మరో వైపు టీడీపీ నుంచి కూడా హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు సంబంధి ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పార్లమెంట్ భవనం గురించి ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా పీఎంను కొనియాడారు.
Also Read : Siddaramaiah Meet