Karnataka Cabinet : కర్ణాటక కేబినెట్ పై కసరత్తు
సోనియా ..రాహుల్ తో సీఎం చర్చలు
Karnataka Cabinet : కర్ణాటక కేబినెట్ లో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ వీడింది. ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు స్పీకర్ , ఎనిమిది మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా సిద్దరామయ్య మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలనే దానిపై హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ హై కమాండ్ ను కలుసుకున్నారు. అనంతరం జన్ పథ్ కు వెళ్లారు. అక్కడ సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తర్వాత తొలిసారిగా సోనియాను కలుసుకున్నారు.
తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కొత్త మంత్రివర్గంలో వీరికి చోటు దక్కనుందని టాక్. ప్రస్తుతం వినిపిస్తున్న వారి పేర్లలో మాంకాళ వైద్య, మధు బంగారప్ప, నరేంద్ర స్వామి, చెలువ రామస్వామి, ఎం సీ సుంధాకర్ ఉన్నారు. వీరితో పాటు డి. సుధాకర్ , లక్ష్మీ హెబ్బాల్కర్ , బైరతి సురేష్ , బసవరాజ రాయ రెడ్డి, పుట్టరంగ శెట్టి , హెచ్ సీ మహదేవప్ప, కృష్ణ బైరేగౌడ కు ఛాన్స్ దక్కనుంది.
ఇక అజయ్ ధరమ్ సింగ్ , హెచ్ కే పాటిల్ , శరణ బసప్ప , రహీమ్ ఖాన్ , కేఎన్ రాన్న, శివ లింగ గౌడ, ఈశ్వర్ ఖండ్రే , శివానంద పాటిల్ , కే. వెంకటేశ్ , ఎస్ఎస్ మల్లికార్జున, శివరాజ్ తంగడగి, బి.నాగేంద్ర పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించలేదు.
Also Read : KTR US UK Tour