S Jai Shankar : పాలిటిక్స్ కు కూడా ప‌రిమితి ఉండాలి

కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్

S Jai Shankar : విప‌క్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar). రాజ‌కీయాలు చేసేందుకు కూడా ఒక ప‌రిమితి అంటూ ఉండాల‌ని కానీ పొద్ద‌స్తమానం పాలిటిక్స్ చేయాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. శుక్ర‌వారం ఎస్ జై శంక‌ర్ మీడియాతో మాట్లాడారు. నూత‌న పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం ఈనెల 28న జ‌ర‌గ‌నుంది. దీనిని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కాకుండా ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది.

దేశానికి మొద‌టి పౌరుడు రాష్ట్ర‌ప‌తి. ఆర్టిక‌ల్ 87 ప్ర‌కారం ఎవ‌రైనా స‌రే అధికారిక భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ప్రారంభించాల్సి ఉంటుంది. ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం కొలువు తీరిన ద్రౌప‌ది ముర్ము ఆదివాసీ తెగ‌కు చెందిన వారు. ఆమె ప‌ట్ల మోదీ వివ‌క్ష చూపిస్తున్నారంటూ విప‌క్షాలు మండిప‌డ్డాయి. ఈ మేర‌కు 20 పార్టీలు నూత‌న పార్ల‌మెంట్ ప్రారోంభోత్స‌వాన్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎస్ జై శంక‌ర్.

రెండు రోజుల గుజ‌రాత్ టూర్ కు వ‌చ్చిన ఆయ‌న న‌ర్మ‌దా జిల్లా రాజ్ పిప్లా ప‌ట్ట‌ణంలో మాట్లాడారు. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్ని దేశ వ్యాప్తంగా ఓ పండుగ‌లా జ‌రుపు కోవాల‌ని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. దీనిని వివాదాస్ప‌దం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. కొంద‌రు కావాల‌ని దీనిపై రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నారంటూ ఎస్ జై శంక‌ర్ మండిప‌డ్డారు.

Also Read : Delhi Court

Leave A Reply

Your Email Id will not be published!