CM YS Jagan : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – జగన్
దేశంలోనే ఏపీ అభివృద్దిలో నెంబర్ వన్
CM YS Jagan : ప్రజా సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan). అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్లిందన్నారు. రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలకు 50,793 మంది అక్కా చెల్లెమ్మలను యజమానులను చేసిన ఘనత తమదేనని చెప్పారు సీఎం.
సీఆర్డీయే ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందజేశామన్నారు జగన్ రెడ్డి. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే కొందరు కావాలని దీనిని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతిగా మారి పోతుందని చెప్పారు.
మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1400 ఎకరాలలో వేల మందికి ఇళ్ల స్థలాలు అందజేయడం ఆనందగా ఉందన్నారు సీఎం. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తున్నామని తెలిపారు జగన్ రెడ్డి.
మొదటి ఆప్షన్ ఏమిటంటే తామే ఇల్లు కట్టుకుంటామంటే పనుల పురోగతికి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 1.8 లక్షలు జమ చేస్తామన్నారు. రెండో ఆప్షన్ గా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్ , ఇసుక, స్టీల్ కు సంబంధించిన డబ్బులను సమకూరుస్తామని తెలిపారు. ఒకవేళ తాము ఇల్లును నిర్మించు కోలేమని చెబితే ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Director K Vasu