Jagadish Shettar : జ‌గ‌దీశ్ శెట్ట‌ర్ కు బిగ్ ఛాన్స్

ప్లానింగ్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి

Jagadish Shettar : భార‌తీయ జ‌న‌తా పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరు పొందిన మాజీ సీఎం జ‌గ‌దీశ్ శెట్ట‌ర్(Jagadish Shettar) అనూహ్యంగా కాషాయానికి షాక్ ఇచ్చారు. ఆయ‌న‌ను అమిత్ షా, మ‌జీ సీఎం య‌డ్యూర‌ప్ప బుజ్జ‌గించినా ఒప్పు కోలేదు. ఆరుసార్లు జ‌గ‌దీశ్ శెట్ట‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్య‌మంత్రిగా కూడా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా షెట్ట‌ర్ కు టికెట్ ఇవ్వ‌లేదు బీజేపీ హైక‌మాండ్ . దీంతో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు కూడా కాషాయాన్ని వీడారు.

ఎలాంటి మ‌చ్చ లేని నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా అవ‌మానించిన పార్టీలో తాను ఉండేలేనంటూ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే, పీసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సీఎం సిద్ద‌రామ‌య్య స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. త‌క్కువ మార్జిన్ తో ఓట‌మి పాల‌య్యారు. కానీ జ‌గదీశ్ షెట్ట‌ర్ బీజేపీపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌ను అవ‌మానానికి గురి చేసిన కాషాయానికి షాక్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. 20 సీట్లు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.

తాజాగా జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో 224 సీట్ల‌కు గాను 135 సీట్లు కైవ‌సం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సంద‌ర్భంగా త‌న ప‌ద‌విని త్యాగం చేసిన జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ ను స‌ముచితంగా గుర్తించాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ భావించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు అత్యంత కీల‌క‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌నుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ గా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : CM YS Jagan

Leave A Reply

Your Email Id will not be published!