Mayawati PM Modi : ప్రారంభోత్సవానికి మోదీ అర్హుడే
బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం మాయావతి
Mayawati PM Modi : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి(Mayawati) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేలా చేసింది నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం. ఇప్పటికే పార్లమెంట్ కార్యాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న ఆదివారం ప్రారంభిస్తారని ప్రకటించింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టాయి. 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కానీ పీఎం మోదీ ఎలా ప్రారంభిస్తారంటూ ప్రశ్నించాయి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు బీఎస్పీ చీఫ్ మాయావతి.
ట్విట్టర్ వేదికగా ఆమె శనివారం స్పందించారు. ఇది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయడం తగదు అని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రారంభోత్సవాన్ని స్వాగతించాలని ఆమె పిలుపునిచ్చారు. జనహితం కోసం చేసే ఏ కార్యక్రమాలనైనా అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని సూచించారు.
ప్రతి ఒక్కరు స్వాగతం చెప్పాలని అన్నారు. జనహితం కోసం చేసే ఏదైనా దానికి బీఎస్పీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు కుమారి మాయావతి. ప్రస్తుతం మాజీ సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పూర్తి అర్హత ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Chandrababu Naidu