Sajjala Ramakrishna Reddy : సీబీఐ తీరు అనుమానాస్పదం
ప్రభుత్వ సలహాదారు సజ్జల
Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) సంచలన కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డి కేసు విషయంలో సీబీఐ అనుసరిస్తున్న తీరు, దర్యాప్తు చేస్తున్న విధానం అనుమానస్పదంగా ఉందని ఆరోపించారు. తన తల్లికి అనారోగ్యం ఉందని చెప్పినా వినిపించు కోవడం లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదని దానిని పట్టుకుని టీడీపీ రెచ్చి పోవడం దారుణమన్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ ను, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ ఏం చేయాలని అనుకుంటుందో ఈ మీడియాకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేసినా ముందుకు దానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తుందన్నారు. అప్ డేట్ నివేదిక ఉంటుందని పేర్కొన్నారు.
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తూ తామే సీబీఐ లాగా వ్యవహరిస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. చవకబారు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని ఆ విషయం చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా తెలుసుకుంటే మంచిదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
Also Read : Kohli De Villiers
